Home  »  TV News  »  సదా కొత్త వ్లాగ్.. తన రెండవ ఇల్లు అదేనంట!

Updated : May 6, 2023


సదా.. ఎవర్ గ్రీన్ బ్యూటీ. తెలుగులో 'జయం' మూవీతో ఇండస్ట్రీలో అందరి చూపుని తనవైపు తిప్పుకున్న ఈ భామ.. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మరింత క్రేజ్ ని సొంతం చేసుకుంది. సదా జంతు ప్రేమికురాలు.. నేచర్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టంతో తను వీకెండ్స్ లో ఫారెస్ట్ కి వెళ్ళి తన ఫోటోగ్రఫీ స్కిల్స్ ని ఉపయోగిస్తుంది. ఎక్కువగా గ్రీనరిని ఇష్టపడుతుంది. తన హోమ్ టూర్ వ్లాగ్ చేసింది. అందులో కూడా తన ఇంటిని కంప్లీట్ గ్రీనరీగా మార్చినట్టు చెప్పిన సదా.. తనకి అలాగ ఉంటేనే ఇష్టమని ఆ వ్లాగ్ లో చెప్పింది.

సదా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా 'జయం' మూవీని చెప్పొచ్చు. జయం సినిమా వచ్చి దాదాపు 20 సంవత్సరాలు దాటినా అప్పటికి ఇప్పటికి తరగని అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది సదా. ఆ తర్వాత వచ్చిన అపరిచితుడు, ప్రియసఖి, సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలని చేసింది. ఎప్పుడు గ్రీనరిని కోరుకునే సదా.. 'సదాస్ గ్రీన్ లైఫ్' పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అయితే రీసెంట్ గా సదా తన సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టింది. పలు టీవి షోస్ లో జడ్జి గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిబి జోడీ షోతో నిన్న మొన్నటివరకు బిజీగా ఉన్న సదా.. ఇప్పుడు ఢీ షోతో ఇంకా బిజీ అయింది.

తాజాగా ఢీ షోలో శేఖర్ మాస్టర్ తో కలిసి సదా చేసిన డ్యాన్స్  మంచి వీక్షకాదరణ పొందింది. అయితే శేఖర్ మాస్టర్, సదా కాంబినేషన్ జడ్జిమెంట్ అంటే వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్.. అయితే సదా తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఇలా తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తూ.. అందరికి దగ్గరగా ఉంటూ వస్తుంది. 

సదా తన షూటింగ్ కోసం వాడే వ్యాన్ ని చూపిస్తూ 'వానిటి వ్యాన్' పేరుతో ఒక వ్లాగ్ ని చేసింది. ఆ వ్యాన్ ని చూపిస్తూ.. ఇది నా సెకండ్ హోమ్ అని చెప్పిన సదా.. ఈ వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా విశేష స్పందన లభిస్తోంది. ఇదేకాక రీసెంట్ గా సదా తన ఇన్ స్టాగ్రామ్ లో తనకి బాగా ఇష్టమైన రెస్టారెంట్ గురించి చెప్పింది. తను ముంబయిలో మొదట స్టార్ట్ చేసిన ఒక రెస్టారెంట్ ని క్లోజ్ చేస్తున్నట్టు చెప్పి వార్తల్లో నిలిచింది. తను ఆ రెస్టారెంట్ ని చాలా కష్టపడి ఇష్టంగా స్టార్ట్ చేసానని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ తనకున్న వ్యాన్ తో ఇలా సరదగా వ్లాగ్ చేసి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది సదా..

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.